ePaper
Sunday, May 31, 2026

వరి ధాన్యం కొనుగోళ్లపై నల్గొండ కలెక్టరేట్ ముందు రైతు మహా ధర్నా

చీకటి వెలుగు నల్గొండ:

వరి ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు మహా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొని రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఈ మహా ధర్నాలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, భూపాల్ రెడ్డి, రవీంద్ర కుమార్, భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

అదేవిధంగా మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, ఒంటెద్దు నరసింహ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ప్రసన్నరాజ్, రేగట్టే మల్లికార్జున రెడ్డి, కృష్ణా రెడ్డి తదితర నాయకులు హాజరై రైతులకు మద్దతు తెలిపారు.

రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!