క్షేత్రస్థాయిలో పరిశీలించిన జాయింట్ డైరెక్టర్ డి. సుబ్బారాజు

చీకటి-వెలుగు, మే 12:
వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి
జనగణన–2027 ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని హైదరాబాద్ జనగణన శాఖ జాయింట్ డైరెక్టర్ డి. సుబ్బారాజు అధికారులకు సూచించారు.
మంగళవారం హనుమకొండలోని 28వ డివిజన్ పరిధిలో గోవిందరాజుల గుట్ట, సత్యం లేన్, స్టేషన్ రోడ్ ప్రాంతాల్లో కొనసాగుతున్న జనగణన ఎన్యుమరేషన్ ప్రక్రియను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఇంటింటి సర్వే నిర్వహణ, వివరాల నమోదు విధానం, ప్రజలకు అవగాహన కల్పిస్తున్న తీరును పరిశీలించిన ఆయన… ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు పలు సూచనలు చేశారు. ప్రతి కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
జనగణన దేశాభివృద్ధికి కీలకమైన ప్రక్రియ అని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనగణన శాఖ సెక్షన్ ఆఫీసర్ సతీష్, రెవెన్యూ అధికారి బి. శ్రీనివాస్, ఆర్‌ఐ అశోక్ కుమార్, వార్డ్ ఆఫీసర్, బిల్ కలెక్టర్ కుమారస్వామి, సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments