జనగామ మాతృ శిశు కేంద్రం (MCH)లో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో SPS రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పనిచేస్తున్న బెడ్‌సైడ్ కార్మికులు, శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందిపై తీవ్ర శ్రమదోపిడీ జరుగుతోందని మండిపడ్డారు.
లేబర్ చట్టాల ప్రకారం ప్రతి కార్మికుడు 8 గంటల పని విధానం చేయాల్సి ఉన్నప్పటికీ, జనగామ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏజెన్సీ నిర్వాహకులు కార్మికులపై అదనపు భారం మోపుతూ, విధులకు హాజరైన వారికే గైర్హాజరు చూపించి వేతనాల్లో కోతలు పెడుతున్నారని ఆరోపించారు.
“ఇక్కడ అసలు అధికారి ఎవరు..? ఏజెన్సీ పేరుతో దళారీతనం నడిపిస్తున్నవారు ఎవరు..? వారికి కొమ్ముకాస్తున్న పై అధికారులు ఎవరు..?” అనే అంశాలపై పూర్తి ఆధారాలతో ఆరోగ్య శాఖ మంత్రి, హెల్త్ కమిషనర్, DMEలకు SPS రాష్ట్ర కమిటీ తరఫున మెమోరాండం అందజేస్తామని తెలిపారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న బోస్క నరేష్ మాట్లాడుతూ కార్మికుల పక్షాన పోరాటం కొనసాగుతుందని, దుర్మార్గపు చర్యలకు పాల్పడే వారిని సహించబోమని హెచ్చరించారు. హాజరు శాతంలో అవకతవకలు, విధుల్లో వివక్షతపై జిల్లా అధికారులు, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ వైఖరి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో కార్మికుల సమక్షంలో నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన జిల్లా కమిటీ సభ్యులు:
జిల్లా అధ్యక్షులు – E. రఘు
జిల్లా ప్రధాన కార్యదర్శి – G. అజయ్
జిల్లా ఉపాధ్యక్షులు – E. స్వామి, N. కవిత
జిల్లా సహాయ కార్యదర్శులు – E. బాలరాజు, D. ఉప్పలయ్య, స్వప్న
జిల్లా కోశాధికారి – B. రూతు
జిల్లా ప్రచార కార్యదర్శులు – B. సునీత, A. స్వప్న
జిల్లా సోషల్ మీడియా కన్వీనర్లు – Ch. అనుష, సుశీల
కమిటీ సభ్యులు – బాలమణి, కాంతమ్మ, సరిత, సిద్దల్, రాజు తదితరులు.
రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర కమిటీ సూచించిన రాబోయే కార్యాచరణకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న బోస్క నరేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి గొర్రె నాగరాజు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments