ePaper
Friday, May 15, 2026

విపస్య స్కూల్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు

చర్లపల్లి లోని విపస్య స్కూల్లో శుక్రవారం సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించగా, చిన్నారులకు భోగి పండ్లు పోసి, భోగి మంటలు వేసి, పతంగులను ఎగురవేశారు.

పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు పాఠశాల చైర్మన్ బండారు ప్రసాద్, డైరెక్టర్లు ఎదుపాటి అంజమ్మ, ఓరుగంటి భాగ్యలక్ష్మి, ప్రిన్సిపల్ శ్రీకాంత్ బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సిబ్బంది గోపి, రమా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!