ePaper
Wednesday, April 29, 2026

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం…సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం.

నల్గొండ శివారులో అద్దంకి–నార్కట్పల్లి రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గంగసాని సాయిసందీప్ తన కారులో హైదరాబాద్‌కు బయలుదేరిన సమయంలో ప్రమాదం జరిగింది.

ఉదయం సుమారు 6:10 గంటల సమయంలో పానగల్ బైపాస్ ఫ్లైఓవర్ వద్ద నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జైంది.

ఈ ప్రమాదంలో సాయిసందీప్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!