పేదలకు అందుబాటు వైద్యం అందిస్తాం: డా. రవి ప్రసాద్
చీకటి వెలుగు నల్గొండ,
నల్గొండ పట్టణ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన లావణ్య హాస్పిటల్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. వేదమంత్రాల నడుమ జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆసుపత్రి దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందించడం వైద్యుల ప్రధాన బాధ్యత అని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలుస్తూ, అవసరమైన సందర్భాల్లో ఉచిత వైద్య సేవలు కూడా అందించాలని సూచించారు. వైద్య వృత్తిలో సేవాభావమే గొప్ప సంపద అని పేర్కొంటూ, సమాజం పట్ల బాధ్యతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఆసుపత్రి నిర్వాహకులు డా. లావణ్య మరియు డా. రవి ప్రసాద్ మాట్లాడుతూ, అత్యాధునిక వైద్య సదుపాయాలతో నల్గొండ ప్రజలకు మెరుగైన చికిత్స అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. పేదలకు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తమ వంతు సహకారం అందిస్తూ, అవసరమైన వారికి ఉచిత వైద్య సేవలు కూడా అందించేందుకు కట్టుబడి ఉంటామని చెప్పారు.
కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బాగోని రమేష్, మంత్రవాది శ్రవణ్ కుమార్ ,ప్రజాప్రతినిధులు, వైద్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, నగర ప్రముఖులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని లావణ్య హాస్పిటల్ విజయవంతంగా సేవలు అందించాలని ఆకాంక్షించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments