ePaper
Saturday, May 2, 2026

దానం, శ్రీహరికి క్లీన్ చిట్‌పై కేటీఆర్ ఆగ్రహం

పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

ఈ నిర్ణయాన్ని ఆయన ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడిగా అభివర్ణించారు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌పై ఎంపీగా పోటీ చేసినప్పటికీ క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమేనని అన్నారు.

స్పీకర్ నిర్ణయం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేలా ఉందని కేటీఆర్ ఆరోపించారు. ఇది కేవలం ఒక తీర్పు మాత్రమే కాదని, అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగిస్తున్నారనే సంకేతమని విమర్శించారు.

తెలంగాణ ప్రజలు ఈ పరిణామాలను గమనిస్తున్నారని, సరైన సమయంలో వారు సమాధానం చెబుతారని కేటీఆర్ పేర్కొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!