నల్లగొండ పట్టణంలోని SLBC ప్రాంతంలో గల పెజ్జోని బ్లూమింగ్ బడ్స్ పాఠశాల పునఃప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్లగొండ బిషప్ శ్రీ కరణం ధమన్ కుమార్ , మరియు నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి , మాట్లాడుతూ ఫాదర్ పెజ్జోని , స్థాపించిన సంస్థ ద్వారా జరుగుతున్న సేవలను కొనియాడుతూ, వారి తదనంతరం సేవలను కొనసాగుతున్న FSI సిస్టర్స్ ను అభినందించారు. ఈ పాఠశాల ద్వారా నాణ్యమైన విద్య పరిసర ప్రాంతాల్లోని చిన్నారులకు విస్తరించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆకాంక్షించారు. బిషప్ శ్రీ కరణం ధమన్ కుమార్ , మాట్లాడుతూ బాల్యం నుంచే క్రమశిక్షణతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ,నగర డిప్యూటీ మేయర్ మహ్మద్ అష్రఫ్ అలీ , కథిడ్రల్ పారిష్ ప్రీస్ట్ శ్రీ G. బాలస్వామి మాజీ వార్డు సభ్యులు శ్రీ జానయ్య , Ex-ZPTC కోఆప్షన్ సభ్యులు శ్రీ పసల శౌరయ్య పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
లెప్రసీ హెల్త్ సెంటర్ సంస్థ డైరెక్టర్ సిస్టర్ అంబిక, సిస్టర్ సిసిలీ, సిస్టర్ ఈవ, సిస్టర్ ఆరోక్య మేరి మరియు పెజ్జోని బ్లూమింగ్ బడ్స్ పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ లీమా, సిబ్బంది సిస్టర్ గోరెటీ, సిస్టర్ క్రిస్టీనా, సిస్టర్ కాథరిన్, సిస్టర్ జీనత్, పాఠశాల చిన్నారులు, తల్లి దండ్రులు ఇతరులు పాల్గొని చిన్నారులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments