ePaper
Tuesday, April 28, 2026

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐ&పీఆర్ నూతన కమిషనర్, ఎఫ్‌డీసీ ఎం.డి ముకుంద రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఐ&పీఆర్ (సమాచార, ప్రజాసంబంధాల శాఖ) నూతన కమిషనర్, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) మేనేజింగ్ డైరెక్టర్ ముకుంద రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా శాఖకు సంబంధించిన ప్రస్తుత కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై మంత్రి గారికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేసే దిశగా చర్యలు చేపడతామని ముకుంద రెడ్డి తెలిపారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొత్త బాధ్యతలు చేపట్టిన ముకుంద రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, శాఖ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!