చీకటి వెలుగు నల్లగొండ.
పర్యావరణ పరిరక్షణలో భా2గంగా మట్టి విగ్రహాల తయారీపై విద్యార్థులు, మహిళలకు ఉచిత శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. సత్య డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది విద్యార్థులు, మహిళలకు మట్టి విగ్రహాల తయారీపై శిక్షణ అందించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించని మట్టి విగ్రహాల తయారీని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు, మహిళలు ఇలాంటి శిక్షణను సద్వినియోగం చేసుకుని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు.
ఈ సందర్భంగా అరుణ్ జ్యోతి లోకండే విద్యార్థులు, మహిళలకు మట్టి విగ్రహాల తయారీ విధానంపై శిక్షణ ఇచ్చారు. మట్టి విగ్రహాల తయారీ, వాటికి ఆకృతులు ఇవ్వడం, రంగులు అద్దడం తదితర అంశాలను ప్రాక్టికల్‌గా వివరించారు.
ఈ కార్యక్రమంలో వేదాంతం, పాఠశాల కరస్పాండెంట్ సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ అరవింద్ రెడ్డి, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు హరీ రామ్ కృష్ణ, సతీష్, అనీష్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments