ePaper
Thursday, September 3, 2026

సేవామూర్తుల స్మృతికి స్మారకం

పెరిక గోపాల్‌, రాజరత్నం విగ్రహాల ఆవిష్కరణ

చీకటి వెలుగు నల్లగొండ.

ప్రజా జీవితంలో విశేష సేవలందించిన మాజీ నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కీ.శే. పెరిక గోపాల్‌, మాజీ ఎమ్మెల్యే కీ.శే. పెరిక రాజరత్నం విగ్రహాలను గురువారం నల్లగొండ ప్రకాశం బజార్‌ కూరగాయల మార్కెట్‌ కూడలిలో ఆవిష్కరించారు. 16వ డివిజన్‌ కార్పొరేటర్‌ పెరిక స్వాతి వినాయకరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ సేవామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా వారి సేవలను భావితరాలకు పరిచయం చేయడం అభినందనీయమన్నారు. పెరిక గోపాల్‌, పెరిక రాజరత్నం ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు సాగాలని కోరారు. కార్పొరేటర్‌ స్వాతి వినాయకరాజు మాట్లాడుతూ తన మామయ్యలు అందించిన సేవలను స్మరించుకోవడం తమ కుటుంబానికి గర్వకారణమన్నారు. వారి స్ఫూర్తితోనే ప్రజాసేవలో కొనసాగుతున్నానని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ అశ్రఫ్‌ అలీ అమీర్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గురు శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీలు గుమ్మల మోహన్‌రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్‌ యాదవ్‌, .పెరిక రాజరత్నం కుటుంబ సభ్యులు, కుమారులు పెరిక ఉమామహేశ్వర్ రాజు, పెరిక కరంజయరాజు, పెరిక వినాయకరాజు తదితరులు పాల్గొన్నారు.కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొని విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!