మంత్రి క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసిన పార్టీ శ్రేణులు

చీకటి వెలుగు నల్గొండ.
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. శ్రీనగర్ కాలనీలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి మేయర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్‌తో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు మేయర్‌ను పూలబొకేలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శంకర్‌నాయక్ మాట్లాడుతూ చైతన్య శ్రీనివాస్‌రెడ్డి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆమె కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉప మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు గుమ్ముల మోహన్‌రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, మాజీ మున్సిపల్ ఉపాధ్యక్షుడు అబ్బగోని రమేష్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు కేసాని వేణుగోపాల్‌రెడ్డి, మారగోని నవీన్‌గౌడ్, సమద్, అల్లి మల్లికార్జున్‌యాదవ్, ఖయ్యూం బేగ్, ఆలకుంట్ల నాగరాజు, ఇంతియాజ్, పాలకుంట్ల నాగరత్నం రాజు, రేగట్టే లింగస్వామిగౌడ్, ఇబ్రహీం, గుండెబోయిన పుష్పలత వెంకన్నయాదవ్, ఇటికాల మంగమ్మ శ్రీనివాస్, మామిడి కార్తీక్, ఇర్ఫాన్, వజ్జ రమేష్‌యాదవ్, పాలకూరి సుమలత సంతోష్, ప్రదీప్‌నాయక్, చిన్నాల జానయ్య, నంద్యాల వీరబ్రహ్మానందరెడ్డి, సంకు ధనలక్ష్మి, పాదం అనిల్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, వంగాల అనిల్‌రెడ్డి, కంచర్ల ఆనంద్‌రెడ్డి, పెరిక చిట్టితో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మేయర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments