ePaper
Friday, September 4, 2026

నల్గొండలో అతి పెద్ద ఆగమన్‌కు సర్వం సిద్ధం

నల్గొండ: నల్గొండ చా రాజా ఆధ్వర్యంలో, త్రిశూల్ సేన ఉత్సవ కమిటీ నిర్వహించనున్న అతి పెద్ద ఆగమన్ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఆగస్టు 30, ఆదివారం సాయంత్రం 6 గంటలకు నల్గొండలోని వీటీ కాలనీలో ఈ కార్యక్రమం జరగనుంది.

నల్గొండలో తొలిసారిగా ఇంత భారీ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ ఆగమన్ కార్యక్రమానికి భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

భక్తి, ఐక్యత, సామాజిక సమైక్యతను చాటేలా ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. “ఒకే భక్తి.. ఒకే సమాజం.. ఒకే వేడుక” అనే సందేశంతో అందరూ కలిసి ఈ చారిత్రక వేడుకలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

జై గణేష్!


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!