చీకటి వెలుగునల్లగొండ
నల్లగొండ పట్టణంలోని ఎన్ఆర్ఎస్ గార్డెన్స్ సమీపంలో మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహ నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహ ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్టు బోర్డు అధ్యక్షుడు నేతి రఘుపతి నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో శాసనమండలి మాజీ ఉపాధ్యక్షుడు నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వసతి గృహ నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు తమ వంతు సహకారం అందిస్తామని నేతి విద్యాసాగర్, పూల రవీందర్ తెలిపారు. నల్లగొండ జిల్లాలోని మున్నూరు కాపు కుల బంధువులంతా నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నల్లగొండకు విద్యాభ్యాసం కోసం వచ్చే విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించడమే వసతి గృహ నిర్మాణం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణలోని మున్నూరు కాపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల సహకారంతో విరాళాలు సేకరించి భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ట్రస్టు ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్టు ప్రధాన కార్యదర్శి తోకల వెంకటకృష్ణ, కోశాధికారి నేతి ఉమామహేశ్వర్, గౌరవ అధ్యక్షుడు కాటం సునీల్, ఉపాధ్యక్షుడు మేకల వెంకన్న, సహాయ కార్యదర్శి రామగిరి వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు, ట్రస్టు బోర్డు సభ్యులు, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. వీడియో పాత్రికేయుడు చేపూరి రవి కార్యక్రమాన్ని చిత్రీకరించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments