ePaper
Friday, September 4, 2026

సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ బాటలు

నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత.

చీకటి వెలుగు నల్లగొండ.

దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతిని పురస్కరించుకుని నల్గొండ జిల్లా కేంద్రంలోని శివాజీనగర్‌లో కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగతి సాధించేందుకు రాజీవ్ గాంధీ విశేష కృషి చేశారని కొనియాడారు. టెలిఫోన్, కంప్యూటర్ వంటి ఆధునిక సాంకేతికతలను దేశంలో విస్తృతంగా ప్రవేశపెట్టి అభివృద్ధికి పునాదులు వేశారని పేర్కొన్నారు. యువతకు రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పించే ఉద్దేశంతో ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ సేవలను ప్రజలు ఎన్నటికీ మరువరని కైలాష్ నేత అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు జిల్లాపల్లి పరమేష్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు చింత యాదగిరి, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ముంతాజ్ అలీ, జిల్లా ప్రధాన కార్యదర్శి దొండ రమేష్, జిల్లా కార్యదర్శి దామనూరి అశోక్, పగిళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్, పళ్ళ రవితేజ, ఎండి అజీజ్, మట్టపల్లి నాగరాజ్, శ్రీనివాస్, వేముల గోపీనాథ్, ఇందనూరి శ్రీను, బోడ అరుణ్, జమ్మూ అశోక్, లింగస్వామి, యాదగిరి, మాచగిరి, గణపురం మహేష్, పున్న గణేష్, కత్తుల గణేష్, అనిల్ కుమార్, నల్లబోతు శంకర్, అకంటి సైదులు, యశ్వంత్, రాజేష్, బాలకృష్ణ, పులుసు నాగార్జున, సచిన్, వినీత్, శరత్, బోడ విజయ్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!