
నల్లగొండ: భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా నల్లగొండ జిల్లా కమిటీని ప్రకటించారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గండమల్ల ఆనంద్ గౌడ్, జిల్లా ఇన్‌చార్జ్ ఉదయ్ ప్రతాప్ సూచనల మేరకు నూతన కార్యవర్గాన్ని ప్రకటించినట్లు తెలిపారు.
నూతన కమిటీలో 7 మంది ఉపాధ్యక్షులు, 3 మంది ప్రధాన కార్యదర్శులు, 6 మంది కార్యదర్శులు, కోశాధికారి, సోషల్ మీడియా కన్వీనర్, ఆఫీస్ సెక్రటరీ, కో-ఆఫీస్ సెక్రటరీతో పాటు 6 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులను నియమించారు.
ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సభ్యులకు పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు. OBC వర్గాల సమస్యలు, హక్కుల కోసం పార్టీ తరఫున మరింత చురుగ్గా పనిచేయాలని సూచించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments