చీకటి వెలుగు నల్లగొండ.
దళిత క్రైస్తవుల రాజ్యాంగ హక్కులను హరించిన 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వు (షెడ్యూల్డ్ కులాలు) 3వ పేరా అమలులోకి వచ్చిన రోజును పురస్కరించుకొని ఆగష్టు 10న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ (ధర్నా చౌక్) వద్ద దళిత క్రైస్తవుల మహా నిరసన సభ నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ (AICF) జిల్లా నాయకులు తెలిపారు.
ఈ మహా నిరసన సభ ఆగష్టు 10 వ తేదిన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ విచ్చేయనున్నారని,దళిత క్రైస్తవులకు జరిగిన చారిత్రక అన్యాయానికి వ్యతిరేకంగా, ఎస్.సి. హోదా సాధన కోసం ఈ సభను నిర్వహిస్తున్నామని నాయకులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన దళిత క్రిస్టియన్లు స్వచ్ఛందంగా, పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ మహా నిరసన సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ కమిటీ సభ్యులు ఎం.ఆనందమయ, జె. ఆశీర్వాదం. ఎం. ఏసురత్నం, కత్తుల యెహోవా దాస్, చింత సైదులు పాల్, వేముల ఆనంద్, సిహెచ్.జాషువా తదితరులు పాల్గొన్నారు
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments