ePaper
Friday, September 4, 2026

ప్రజలకు మెరుగైన ఫిజియోథెరపీ సేవలు అందించడమే లక్ష్యం: మౌలానా హసనుద్దీన్ సాబ్

చీకటి వెలుగు నల్లగొండ.

పట్టణ ప్రజలకు నాణ్యమైన, ఆధునిక ఫిజియోథెరపీ సేవలు అందించాలనే లక్ష్యంతో డా. బరీరా తన్వీమా (ఫిజియోథెరపిస్ట్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోసీ ఫిజియోథెరపీ క్లినిక్‌ను మౌలానా హసనుద్దీన్ సాబ్ ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు అధునాతన ఫిజియోథెరపీ సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నిపుణుల సేవలతో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్ పట్టణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హాజరై డా. బరీరా తన్వీమాకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బషీర్ మౌలానా సాబ్, మాజీ కౌన్సిలర్ హాసన్ సాబ్, అక్బరుద్దీన్ సాబ్, జిల్లా హజ్ కమిటీ కార్యదర్శి అబ్జలుద్దీన్ సాబ్, ఎం.కే. సిద్ధిర్, అమీనుద్దీన్, జిల్లా హజ్ కమిటీ కార్యదర్శి ఎల్‌.వి. యాదవ్, టౌన్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ టీడీపీ గుండు వెంకటేశ్వర్లు, టౌన్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డా. బరీరా తన్వీమా మాట్లాడుతూ, మెడ నొప్పి, వెన్నునొప్పి, భుజాల నొప్పి, టెన్నిస్ ఎల్బో, మోకాళ్ల నొప్పి, చీలమండ నొప్పి, బెల్స్ పాల్సీ/ఫేషియల్ పాల్సీతో పాటు కండరాలు, నరాలు, ఎముకలకు సంబంధించిన వివిధ సమస్యలకు ఆధునిక పద్ధతుల్లో సమగ్ర ఫిజియోథెరపీ చికిత్స అందిస్తామని తెలిపారు.

రోగులు త్వరగా కోలుకుని నొప్పిలేని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. “కదలికే ఔషధం” అనే నినాదంతో ప్రారంభమైన రోసీ ఫిజియోథెరపీ క్లినిక్ ద్వారా ప్రజలకు నిపుణులైన ఫిజియోథెరపీ సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

క్లినిక్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అభిమానులు, బంధుమిత్రులు, స్థానిక ప్రజలకు డా. బరీరా తన్వీమా కృతజ్ఞతలు తెలిపారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!