చీకటి వెలుగు నల్లగొండ.
2020 సంవత్సరంలో ఉన్న పాత రేట్లనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ పట్టణ గ్రామీణ మార్బుల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రోడ్డులోని మార్బుల్ షాపుల ముందు మంగళవారం మార్బుల్ కార్మికులు భారీ ధర్నా చేపట్టారు. ధర్నాను ఉద్దేశించి యూనియన్ గౌరవాధ్యక్షులు దాసరి దేవయ్య అధ్యక్షుడు ఎన్ హరి తదితరులు మాట్లాడుతూ, బిల్డర్లు గృహ నిర్మాణ యజమానులు ఒక్కటై మార్బుల్ రేట్లను తగ్గించారని, దీనివలన తాము అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇంటికి రాయిలు, పిల్లల చదువులు, అనారోగ్య సమస్యలతో తాము ఇబ్బందులు పడుతున్నామని,2025లో అమలు చేస్తున్న పాతరెట్లనే ప్రస్తుతం కూడా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాజస్థాన్ వంటి దూర ప్రాంతాల నుండి వచ్చిన వలస కార్మికులకు మార్బుల్ కూలి రేట్లు గిట్టుబాటు కాకపోవడంతో వాళ్లు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. అలాగే ఇసుక మోపించడానికి గాని బండలు లోపల పైన పెట్టించాలని పెద్దబండలకు అదనపు లేబర్ ను ఫిట్టింగ్ చేసేటప్పుడు నియమించాలని కోరారు. అలాగే తమకు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు అయినా ఇందిరమ్మ ఇండ్లు, హెల్త్ కార్డులు, పెన్షన్లు అందజేయాలని, కోరారు,ఈ కార్యక్రమంలో మరో గౌరవాధ్యక్షుడు ఎం శ్రీనివాస్, కార్యదర్శి శ్రీకాంత్ క్రాంతి, కోశాధికారి శ్రీను, సహాయ కార్యదర్శి దేవి సింగ్, ఆర్థిక కార్యదర్శి రాంపాల్, ఉపాధ్యక్షులు ఎస్ జానీ,కార్యవర్గ సభ్యులు శిరసావాడ సైదులు,ఎస్ గురువులు, మట్టి శెట్టి సైదులు,చందు, సురేష్, నకరికంటి రవి, చిగుళ్ల శంకర్, భకరం మహేందర్, రాజస్థాన్ సంజయ్, రాజస్థాన్ సంతోష్,రాజస్థాన్ రాంప్రసాద్,దాసరి మల్లేష్, దాసరి శేఖర్ తోపాటు 150 మంది కార్మికుల పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments