ePaper
Friday, September 4, 2026

అభినందనీయుడు యాదన్న..కలెక్టర్.

చీకటి వెలుగు నల్లగొండ. సుదీర్ఘ కాలం పాటు సమాచార శాఖ ద్వారా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో సేవలందించి పదవీ విరమణ చేస్తున్న జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయ రికార్డ్ అసిస్టెంట్ యాదన్న అభినందనీయుడని జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ అన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ గా పనిచేస్తూ శుక్రవారం పదవి విరమణ పొందిన యాదన్నను జిల్లా కలెక్టర్ తన చాంబర్లో శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. పదవి విరమణ అనంతరం కుటుంబంతో సుఖ ,సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. యాదన్న పదవీ విరమణ సందర్భాన్ని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయ సిబ్బంది, పలువురు మీడియా ప్రతినిధులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు , బందు మిత్రులు పెద్ద ఎత్తున శాలువాలు పూలమాలలతో యాదన్నను సన్మానించారు . ఈ సందర్భంగా యాదన్న సమాచార శాఖకు అందించిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ సహాయ సంచాలకులు యు. వెంకటేశ్వర్లు ,డిపిఆర్ఓ కార్యాలయ సిబ్బంది భీమేష్ కుమార్, రేణుక, పర్వీన్, సహదేవ్ తో పాటు, సూర్యాపేట ,యాదాద్రి భువనగిరి జిల్లాల సిబ్బంది, మీడియా ప్రతినిధులు, యాదన్న దంపతులను సన్మానించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు వారి పాటలతో అలరించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!