ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి నిరసనగా శాంతియుతంగా ప్రశ్నించిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై దాడి చేసి అరెస్ట్ చేయడాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.
బుధవారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్ట్ చేయడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టేందుకు, రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా టీపీసీసీ ఆధ్వర్యంలో ‘ఛలో లోక్ భవన్’ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు.
“ప్రశ్నించే గొంతుకలను అరెస్టులతో అణచివేయలేరు. రాహుల్ గాంధీ వెనుక దేశ ప్రజలందరూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన సమయం ఇది” అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments