ePaper
Tuesday, September 8, 2026

పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది:

డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్‌ నేత

చీకటి వెలుగునల్లగొండ,

శాలిగౌరారం మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్‌ నేత మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రైతుల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ హయాంలో 10 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసింది బీఆర్‌ఎస్‌ కాదా అని ప్రశ్నించారు. నిరుద్యోగులను కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విస్మరించిందని, నల్లగొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ఆయన ప్రశ్నించారు. డిండి, శ్రీశైలం సొరంగ మార్గం పనులతో పాటు చర్లగౌరారం, కిష్టారంపల్లి, బ్రాహ్మణవెల్లం, శాలిగౌరారం ప్రాంతంలోని అసిఫ్‌నగర్‌ కాలువ పనులను గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసిఫ్‌నగర్‌ కాలువ పరిధిలోని రైతులకు నష్టపరిహారం అందించి పనులను ప్రారంభించిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని, రైతులకు రైతు భరోసా పథకాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. సన్న వడ్లకు మద్దతు బోనస్‌, ఐదు లక్షల ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు, చేనేత బీమా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని కైలాష్‌ నేత అన్నారు. 2029లోనూ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ నేతల అసమర్థ పాలన వల్ల అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ చేస్తున్న విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు అన్నేబోయిన సుధాకర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ తాళ్లూరి మురళి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు చింత ధనంజయ్‌, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు తోటకూరి పరుశరామ్‌, శాలిగౌరారం సర్పంచ్‌ శేఖర్‌బాబు, ఉపసర్పంచులు పాపారావు, భాషా, నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి వేముల గోపినాథ్‌తో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!