ePaper
Tuesday, September 8, 2026

రూ.358.18 కోట్లతో 11 రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నకిరేకల్/రామన్నపేట: నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో హ్యామ్ (HAM) ఫేజ్-1, ప్యాకేజ్-2 కింద రూ.358.18 కోట్ల వ్యయంతో 210.10 కిలోమీటర్ల పొడవున 11 రహదారుల అభివృద్ధి పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ రహదారి అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని, గ్రామీణ ప్రాంతాల అనుసంధానం బలోపేతం కావడంతో పాటు ఆర్థిక, సామాజిక అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఆర్&బీ చీఫ్ ఇంజనీర్ బి.వి. రావు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!