నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలోకి దారి తప్పి వచ్చిన జింక ఘటనపై అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించారు.
కథనానికి స్పందించిన నల్లగొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వీరేంద్రబాబు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. బీట్ ఫారెస్ట్ అధికారులు కళాశాల ప్రాంగణాన్ని సందర్శించి జింక కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
కళాశాల పరిసరాలు అడవిని తలపించే వాతావరణం కలిగి ఉండటంతో జింక ప్రస్తుతం ప్రశాంతంగా సంచరిస్తోందని అధికారులు తెలిపారు. జింకకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ప్రజలు, విద్యార్థులు జింకను వెంబడించవద్దని, భయపెట్టవద్దని అటవీశాఖ విజ్ఞప్తి చేసింది. అవసరమైతే జింకను సురక్షితంగా దాని సహజ ఆవాసంలోకి తరలించే చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.
వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని నల్లగొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వీరేంద్రబాబు స్పష్టం చేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments