ePaper
Saturday, July 25, 2026

చర్లపల్లి చేనేత సహకార సంఘం ఎన్నికల్లో ముషం రవి ప్యానెల్ ఘన విజయం

నల్లగొండ, జులై 10 ( చీకటి వెలుగు ):

చర్లపల్లి చేనేత సహకార సంఘం ఎన్నికల్లో ముషం రవి నేతృత్వంలోని ప్యానెల్ ఘన విజయం సాధించింది. సంఘం అధ్యక్ష పదవికి ముషం రవి (తండ్రి: సాంబయ్య) పోటీ చేయగా, పాలకవర్గ సభ్యులుగా గంజి రమేష్ (తండ్రి: బక్కయ్య), గంజి రమేష్ (తండ్రి: ఈశ్వరయ్య), రాపోలు గణేష్ (తండ్రి: రంగయ్య శ్రీశైలం), చిట్టిప్రోలు రమేష్ (తండ్రి: పుల్లయ్య), కటకం వెంకటేశ్వర్లు, రాపోలు బిక్షం, రాపోలు శేషమ్మ, గంజి వెంకమ్మ నామినేషన్లు దాఖలు చేశారు. నేడు నిర్వహించిన ఎన్నికల్లో వీరంతా అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు.
విజేతలకు ఎన్నికల అధికారి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ముషం రవి మాట్లాడుతూ, చేనేత సహకార సంఘం ద్వారా సభ్యులు, చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలు సకాలంలో అందేలా కృషి చేస్తానని తెలిపారు.
విజయోత్సవంలో భాగంగా గెలుపొందిన అభ్యర్థులను అభిమానులు పూలమాలలు వేసి, కుంకుమతో సత్కరించి, స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం వార్డులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాపోలు శ్రీనివాసులు, రాపోలు శంకర్ వేణుబాబు, గుర్రం నరేందర్, గంజి రమేష్ (చుక్కయ్య), గంజి పాండరి, సీహెచ్ కిరణ్, రాజుతో పాటు పలువురు అభిమానులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!