చీకటి వెలుగు, నల్గొండ:
హెచ్‌ఐవీ/ఎయిడ్స్ సోకినవారు భయపడకుండా వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా మందులు వాడాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సూచించారు. గతంలో ఎయిడ్స్ బారినపడిన వారు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉండేవని, ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, మెరుగైన వైద్య చికిత్సలతో పరిస్థితులు ఎంతో మెరుగుపడ్డాయని తెలిపారు.
శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ సొసైటీలో నేస్తం సొసైటీ ఆధ్వర్యంలో, హెల్పింగ్ హాండ్స్ వైజాగ్ మరియు దాతల సహకారంతో హెచ్‌ఐవీ బారినపడిన విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగులను కలెక్టర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, హెచ్‌ఐవీ బాధితులను ముట్టుకోవడం, వారితో కలిసి ఉండడం వల్ల వైరస్ సోకదని, అలాంటి ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. సమాజంలో హెచ్‌ఐవీపై అవగాహన పెరగడంతో పరిస్థితుల్లో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. అయితే హెచ్‌ఐవీ సోకిన వారు ఇతరులకు వ్యాధి వ్యాప్తి చెందకుండా వైద్యుల సూచించిన విధంగా క్రమం తప్పకుండా మందులు వాడటం అత్యంత అవసరమని సూచించారు.
ప్రభుత్వం తరఫున హెచ్‌ఐవీపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, బాధితులకు చికిత్సతో పాటు అవసరమైన ఇతర సౌకర్యాలు కూడా అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో నేస్తం సొసైటీ ఫౌండర్ వెంకన్న, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, ఏఆర్ సెంటర్ హెచ్‌వోడి డాక్టర్ స్వరూప రాణి, డెర్మటాలజీ విభాగాధిపతి డాక్టర్ నరసింహారావు నేత, ఎన్సీడీ ప్రాజెక్టు అధికారి జమీర్, డాక్టర్ మల్లిక, జలీల్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments