ePaper
Saturday, September 5, 2026

పోక్సో కేసులో బండి సాయి భగీరథ్‌కు రెగ్యులర్ బెయిల్

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పోక్సో (POCSO) కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు కీలక ఊరటనిచ్చింది.

భగీరథ్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.

కోర్టు ఆదేశాల ప్రకారం రూ.1 లక్ష చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాలని, అలాగే కోర్టు విధించిన అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.

ఇంతకుముందు పరీక్షలు రాసేందుకు దిగువ కోర్టు వారం రోజుల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయగా, గడువు ముగిసిన తర్వాత జూన్ 25న భగీరథ్ తిరిగి జైలులో లొంగిపోయారు. అనంతరం రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా, తాజాగా ఆయనకు బెయిల్ లభించింది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!