ePaper
Friday, September 4, 2026

రైతులు వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంటలను ఎంచుకోవాలని జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ చెప్పారు.

నల్గొండ జిల్లా, కనగల్ మండల కేంద్రంలో రైతు వేదికలో నిర్వహించిన విత్తనమేళా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విత్తన మేళాకు హాజరైన రైతులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, అంతేకాక రానున్న సీజన్లో నీరు తగ్గే అవకాశం ఉందని, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నీరు తక్కువ అవసరమయ్యే పంటలను సాగు చేయాలని, అలాగే మెరుగైన విత్తనాలు, మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే సరైన దిగుబడులు పొందవచ్చని తెలిపారు. ఇలాంటి పరిస్థితులలో ఎలాంటి పంటలు వేసుకోవాలో, ఎలాంటి విత్తనాలు వాడాలో రైతు వేదికలలో వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలను తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 140 రైతు వేదికలలో విత్తనమేల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. వరి పండించే రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచించాలని, అలాగే వరిలో సన్న రకాల పండించాలన్నారు. ముఖ్యంగా వర్షం తక్కువగా ఉన్న సమయంలో ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. రైతులకు అవసరమైన యూరియాను సకాలంలో అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కనగల్ మండల వ్యవసాయ అధికారి, తహసిల్దార్ పద్మ, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కనగల్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న హ్యాం రోడ్ల పైలాన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పైలాన్ తో పాటు ,పరిసరాలు, రైలింగ్ ,సుందరీకరణ పనులపై ఇంజనీరింగ్ అధికారులకు తగు సూచనలు, సలహాలు చేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!