ePaper
Wednesday, June 3, 2026

చలివేంద్రం ద్వారా దాహార్తి తీర్చడం అదృష్టం: పున్న విశ్వేశ్వర్

నల్గొండ, మే 31: వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు సేవ చేసే అవకాశం దక్కడం ఎంతో అదృష్టమని శ్రీ సత్య సాయి సేవ సమితి నల్గొండ కన్వీనర్ పున్న విశ్వేశ్వర్ అన్నారు.

నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో తిరుమల థియేటర్ ఎదురుగా శ్రీ సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో గత 28 సంవత్సరాలుగా చలివేంద్రం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాటసారులు, కార్మికులు మరియు ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రంలో మంచినీటితో పాటు మజ్జిగ, నిమ్మరసం పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

ఈ ఏడాది వరుసగా 53 రోజుల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా సత్య సాయి సేవ సమితి స్త్రీ, పురుష సేవాదళ్ సభ్యులు సేవలు అందించారని ఆయన వెల్లడించారు.

అలాగే, ప్రతి సంవత్సరం తమ సేవా కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న పల్లెర్ల యాదగిరి కుటుంబ సభ్యులను శ్రీ సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సేవాదళ్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!