ePaper
Saturday, May 30, 2026

ఘనంగా రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి

తేదీ 21-05-2026 నాడు నల్గొండలోనీ యాదవ సంఘం భవన్ లో స్వర్గీయ రాజీవ్ గాంధీ 35 వ వర్ధంతి కార్యక్రమం జరిగింది.జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత హాజరై ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీని దేశ ప్రజలు మరువబోరని శాస్త్ర సాంకేతిక రంగాలను దేశానికి అందించిన మహానీయుడు అని కొనియాడారు. పంచాయతీరాజ్ చట్టాన్ని అందించి BC,SC,ST లకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్ అందించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కిందని అన్నారు. స్వాతంత్రాన్ని అందించి దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, ఎలాంటి చరిత్ర లేని బిజెపి నేడు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం విడ్డూరం అన్నారు. దేశ ప్రజల హక్కులకై పనిచేస్తున్న దేశ నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ 2029లో ప్రధాని అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు BC సెల్ చైర్మన్ జిల్లపల్లి పరమేశ్, SC సెల్ చైర్మన్ బొడ స్వామి,జిల్లా సీనియర్ నేతలు ఎండి ముంతాజ్ అలీ, ఏళ్ల రవీందర్ రెడ్డి, పగిళ్ల రాజు,చర్లపల్లి గౌతమ్,వేముల గోపీనాథ్,చింత ధనుంజయ్, జమ్మూ అశోక్,ఇందనూరి శ్రీను, ఎండి అజీజ్, ఎండి షఫీ,శరత్,గంజి వేణు, కత్తుల గణేష్ తదితరులు పాల్గొన్నారు ..


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!