ePaper
Thursday, April 9, 2026

ఆర్టిజన్స్ సమ్మెపై చర్చలు జరపాలని డిమాండ్

నల్లగొండ జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్యాలయం వద్ద TVAC జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆర్టిజన్స్ సమ్మె రెండో రోజుకు చేరుకుంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం సమ్మెలో పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా సమ్మె జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడం విచారకరమని అన్నారు. విద్యుత్ సంస్థలో 22 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్స్‌కు అర్హతల ఆధారంగా కన్వర్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

స్టాండింగ్ ఆర్డర్స్ రూల్స్ కారణంగా రెగ్యులర్ ఉద్యోగులు, ఆర్టిజన్స్ మధ్య వ్యత్యాసం సృష్టించబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్హతల ఆధారంగా జూనియర్ లైన్‌మన్, సబ్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్ వంటి పదవులకు గుర్తింపు ఇవ్వాలని కోరారు.

తక్కువ వేతనాలతో జీవిస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.

ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించి సమ్మెను నివారించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, జేఏసీ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!