ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నల్లగొండ జిల్లా మాన్యంచల్కలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. పేద ప్రజలకు నాణ్యమైన, సమయానుకూల వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఈ ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించినట్లు చెప్పారు.
సుమారు రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనం ద్వారా పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.
జిల్లా జైలుకు సంబంధించిన స్థలాన్ని సమన్వయం చేసి ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రిలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏసీ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని, ఆసుపత్రిలో ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, డిఎంహెచ్ ఓ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments