ePaper
Tuesday, April 7, 2026

పసునూరి శ్రీనివాస్ మృతి పట్ల సంతాపం… నివాళులర్పించిన నేతలు

స్వర్ణకారుల సంఘం నాయకులు దివంగత పసునూరి జయశంకర్ కుమారుడు పసునూరి శ్రీనివాస్ అనారోగ్యంతో మరణించడం పట్ల నల్లగొండలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది.

పట్టణంలోని ఆయన స్వగృహంలో పార్థివ దేహానికి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

మాజీ కౌన్సిలర్ ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, జిల్లా స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు రాచకొండ గిరి, పట్టణ అధ్యక్షుడు హరి ప్రసాద్, ఇతర రాష్ట్ర, జిల్లా సంఘ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొని పూలమాలలు అర్పించి నివాళులు ఘటించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!