ePaper
Tuesday, April 7, 2026

నల్లగొండలో ప్రజానాట్యమండలి 8వ మహాసభలు… ప్రజా చైతన్యానికి కళలే ఆయుధం

నల్లగొండ జిల్లాలో ప్రజానాట్యమండలి 8వ మహాసభలు జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ మాట్లాడుతూ, ప్రజానాట్యమండలి కళకళ కోసం కాదు, కళ ప్రగతి కోసం అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు నిరంతరం కృషి చేస్తోందన్నారు.

వీధి నాటకాలను పోరాట ఆయుధంగా మార్చుకుని ప్రజల సమస్యలను ప్రతిబింబిస్తూ ముందుకు సాగుతున్న ప్రజానాట్యమండలి, 82 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.

ప్రపంచీకరణ ప్రభావంతో జానపద కళలు, గ్రామీణ సంస్కృతి క్షీణిస్తున్నాయని, మానవ సంబంధాలు కూడా ప్రభావితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ, జానపద కళాకారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని, పెన్షన్లు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

అలాగే నల్లగొండలో మినీ రవీంద్రభారతి ఏర్పాటు చేయాలని కోరారు.

మహాసభల ప్రారంభానికి ముందు కళాకారుల ప్రదర్శనలు నిర్వహించి, కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర, జిల్లా నాయకులు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!