గ్యాస్ కొరతతో జీవనోపాధి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తోపుడుబండ్ల వ్యాపారులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పెట్టి వండర్స్‌తోపుడుబండ్ల వ్యాపారుల సంఘం అధ్యక్షుడు బొడ్డుపల్లి ధనుంజయ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా ఇడ్లీ, దోశ, ఫాస్ట్ ఫుడ్, గప్చుప్ వంటి తినుబండారాలను విక్రయిస్తూ జీవనోపాధి సాగిస్తున్నామని తెలిపారు. గతంలో నూనెపై ఆధారపడిన తమ వ్యాపారం ఇప్పుడు కమర్షియల్ గ్యాస్‌పై ఆధారపడి ఉందని చెప్పారు.
అయితే ఇటీవల గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో తమ జీవనోపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అందువల్ల నెలకు కనీసం 6 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అందజేయాలని కలెక్టర్‌ను కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్, కోశాధికారి దామర శ్రీను, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments