హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న దోమల సమస్యపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు.
ప్రెస్ మీట్‌కు ఆయన దోమతెర (మస్కిటో నెట్) డ్రెస్ ధరించి హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. “నోరు తెరిస్తే నోట్లోకి దోమలు వస్తున్నాయి” అంటూ నగరంలోని పరిస్థితిని ఆయన వివరించారు.
దోమల నియంత్రణలో సంబంధిత అధికారులు విఫలమయ్యారని విమర్శిస్తూ, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పరిశుభ్రత, ఫాగింగ్ చర్యలు సక్రమంగా చేపట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments