ePaper
Friday, May 15, 2026

విద్యా కమిషన్ సిఫారసుల అమలుకు డిమాండ్…. సమాన విద్య, సామాజిక న్యాయం కోసం సదస్సు

అఖిల భారత్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక (CRPF) ఆధ్వర్యంలో “సమాన విద్య, సామాజిక న్యాయం కోసం” అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యా కమిషన్ చేసిన సిఫారసులను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ శాసన మండలి సభ్యుడు అల్గుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ, విద్యా కమిషన్ చేసిన సిఫారసులు స్వాగతించదగ్గవని, ప్రభుత్వం వాటిని ఆమోదించి వెంటనే అమలు చేయాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ ఉండటం, విద్యా ప్రమాణాలు దిగజారుతున్న నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు.

ప్రధాన వక్తగా పాల్గొన్న ఎం.వి. ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ రేగటి వెంకటరెడ్డి మాట్లాడుతూ, విద్యా కమిషన్ సిఫారసులు పిల్లల కేంద్రంగా ఉండి సమాన విద్య, సామాజిక న్యాయం సాధించేలా రూపొందించబడ్డాయని తెలిపారు. వాటి అమలుకు అన్ని వర్గాల ప్రజలు, సంస్థలు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో CRPF రాష్ట్ర కన్వీనర్ గంజి వేణుగోపాల్, సమన్వయకర్త ఏర్ర శివరాజు, రాష్ట్ర కో-కన్వీనర్లు మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!