ePaper
Friday, May 15, 2026

కారు డ్రైవర్ కొడుకుకి ఎమ్మెల్యే టికెట్… విజయ్ అరుదైన నిర్ణయం సంచలనం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ అరుదైన నిర్ణయం తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు.

తన పార్టీ తమిళగ వెంట్రి కళగం (TVK) అభ్యర్థుల జాబితాలో భాగంగా, తన మాజీ కారు డ్రైవర్ మరియు ప్రస్తుతం వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న రాజేంద్రన్ కుమారుడు సబరినాథన్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.

ఈ నిర్ణయం ప్రకటించిన సమయంలో వేదికపై భావోద్వేగ దృశ్యాలు చోటుచేసుకున్నాయి. టికెట్ ప్రకటించగానే సబరినాథన్ భావోద్వేగానికి లోనవగా, విజయ్ ఆయనను ఆత్మీయంగా ఆదుకున్నారు.

సబరినాథన్ పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ, సామాజిక సేవ కార్యక్రమాల్లో ముందుండేవారని సమాచారం.

విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విధేయత, కృషిని గుర్తించి సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తికి అవకాశం ఇవ్వడం ప్రజల్లో సానుకూల స్పందన తెచ్చుకుంటోంది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!