గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC)కు సంబంధించిన 2026-2027 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను కౌన్సిల్ ఆమోదించింది. రూ.1040 కోట్ల 58 లక్షల 75 వేల అంచనాలతో రూపొందించిన బడ్జెట్‌ను మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమోదించారు.
బడ్జెట్ వివరాలను బల్దియా అకౌంట్స్ అధికారి శివలింగం వెల్లడించగా, మెజారిటీ సభ్యులు అంగీకారం తెలపడంతో బడ్జెట్‌కు ఆమోదం లభించింది.
ఈ బడ్జెట్‌లో భాగంగా రూ.349 కోట్ల 19 లక్షలు సాధారణ పన్నుల ద్వారా, రూ.685 కోట్ల 20 లక్షలు వివిధ గ్రాంట్ల ద్వారా, అలాగే రూ.620 కోట్లు డిపాజిట్లు, అడ్వాన్సుల ద్వారా సమకూరుతాయని అంచనా వేశారు.
ఈ సమావేశంలో హన్మకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ఇంచార్జి కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్, డిప్యూటీ మేయర్ రిజ్వాన శమీమ్ మసూద్, కార్పొరేటర్లు మరియు బల్దియా అధికారులు పాల్గొన్నారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments