ePaper
Friday, May 15, 2026

దేశవ్యాప్తంగా ఇంధన కొరత లేదు: BPCL, HPCL

దేశవ్యాప్తంగా ఇంధన కొరతపై వస్తున్న వార్తల మధ్య భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం (HPCL) స్పష్టత ఇచ్చాయి. దేశంలో ఎలాంటి పెట్రోల్, డీజిల్ కొరత లేదని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి.

ఇటీవల కొన్ని ప్రాంతాల్లో బంకులు మూసివేయడం, ‘నో స్టాక్’ బోర్డులు కనిపించడం వల్ల ప్రజల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.

సరఫరా వ్యవస్థ పూర్తిగా సజావుగా కొనసాగుతోందని, ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కంపెనీలు పేర్కొన్నాయి. పుకార్లను నమ్మకుండా సాధారణంగా ఇంధనం వినియోగించాలని వినియోగదారులను కోరాయి.

అధికారులు కూడా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఎక్కడైనా తాత్కాలిక సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!