ePaper
Wednesday, March 18, 2026

వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి

ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లరిజానీ ఒక వైమానిక దాడిలో మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలోనే ఆయన మరణించారని అంతకుముందు వార్తలు వెలువడగా, తాజాగా ఇరాన్ అధికారిక ప్రకటనతో వాటికి మరింత బలం చేకూరింది.

ఈ దాడిలో లరిజానీతో పాటు ఆయన కుమారుడు మరియు అంగరక్షకులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వెల్లడించింది.

లరిజానీ ఇరాన్, ఇస్లామిక్ విప్లవ పురోగతికి జీవితాంతం కృషి చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారని కౌన్సిల్ తన ప్రకటనలో తెలిపింది. సేవలోనే ఆయన అమరత్వాన్ని పొందారని పేర్కొంది.

లరిజానీ మరణంతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా పరిస్థితులు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!