నల్లగొండ పట్టణంలోని పానగల్ ఫ్లైఓవర్ మరియు అద్దంకి బైపాస్ ఫ్లైఓవర్‌లపై ఇరుపక్కల నూతనంగా ఏర్పాటు చేసిన జాతీయ జెండా రంగుల విద్యుత్ లైట్లను సోమవారం సాయంత్రం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పట్టణ అభివృద్ధి దిశగా మున్సిపల్ కార్పొరేషన్ కృషి కొనసాగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కార్పొరేటర్లు బొడ్డుపల్లి లక్ష్మి, కేసాని వేణుగోపాల్ రెడ్డి, ఆలకుంట్ల ఝాన్సీ రాణి, ఆలకుంట్ల నాగరత్నం రాజు, ఎల్లయ్య, మున్సిపల్ అధికారులు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments