ePaper
Tuesday, September 8, 2026

పి.ఏ.పల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం ఆకస్మిక తనిఖీ

జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలన

పి.ఏ.పల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మరియు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా చిలకమర్రి ధాన్యం గోడౌన్‌లో నిల్వలు, తూకం విధానం, రవాణా ఏర్పాట్లను అధికారులు సమగ్రంగా పరిశీలించారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. కొనుగోలు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

రైతులకు వేగవంతమైన చెల్లింపులు చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు. మధ్యవర్తులను నమ్మకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ రైతులకు సూచించారు.

కేంద్రాల వద్ద తాగునీరు, నీడ, కూర్చునే సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు.

రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

కొనుగోలు కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!