ePaper
Saturday, September 5, 2026

శ్రావణ మాసం తొలి ఆదివారం.. ముత్యాలమ్మ తల్లికి విశేష పూజలు

భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించిన వందలాది మంది భక్తులు.

చీకటి వెలుగు నల్లగొండ.

నల్లగొండ: శ్రావణ మాసం మొదటి ఆదివారం సందర్భంగా రామగిరిలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవస్థానంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో కిటకిటలాడింది.

ఈ సందర్భంగా శ్రీ ముత్యాలమ్మ తల్లికి ఆలయ అర్చకులు అంజయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేపట్టారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

శ్రావణ మాసం తొలి ఆదివారం కావడంతో వందలాది మంది మహిళలు, భక్తులు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని కుటుంబ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. బోనాల సమర్పణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

ఈ కార్యక్రమంలో 47వ డివిజన్ కార్పొరేటర్ అబ్బగోని కవితా రమేష్, నాగరాజు, సుమతమ్మ, కళావతి, పవన్, గౌతమ్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!