ePaper
Saturday, September 5, 2026

ఫోటోగ్రఫీ పోటీల్లో కంది భజరంగ్ ప్రసాద్‌కు ద్వితీయ బహుమతి

నల్లగొండ: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీల్లో నల్లగొండ జిల్లా సాక్షి సీనియర్ ఫోటో జర్నలిస్ట్ కంది భజరంగ్ ప్రసాద్ ద్వితీయ బహుమతి సాధించారు.

ఆయన ప్రతిభకు గుర్తింపుగా ద్వితీయ బహుమతితో పాటు నగదు పురస్కారం అందజేయనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు ఏ. గంగాధర్, ప్రధాన కార్యదర్శి కే.ఎన్. హరి తెలిపారు.

ఫోటో జర్నలిజం రంగంలో కంది భజరంగ్ ప్రసాద్ అందిస్తున్న సేవలు, సామాజిక స్పృహతో కూడిన ఛాయాచిత్రాలు, సమకాలీన అంశాలను ప్రతిబింబించే సృజనాత్మకతకు ఈ అవార్డు మరోసారి గుర్తింపుగా నిలిచింది.

జాతీయ, రాష్ట్ర స్థాయిలో 82 అవార్డులు

కంది భజరంగ్ ప్రసాద్ ఇప్పటికే ఫోటో జర్నలిజం రంగంలో తనదైన ముద్ర వేశారు. ఇప్పటివరకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో మొత్తం 82 అవార్డులు సాధించడం విశేషం. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ప్రజా సమస్యలకు సంబంధించిన అనేక సంఘటనలను తన కెమెరాలో బంధిస్తూ ప్రశంసలు, పురస్కారాలు అందుకున్నారు.

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ద్వితీయ బహుమతి సాధించడంతో జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు, వివిధ రంగాల ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు.

నల్లగొండ జిల్లాకు, ఫోటో జర్నలిజం రంగానికి గుర్తింపు తీసుకురావడంలో కంది భజరంగ్ ప్రసాద్ చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!