కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్యనిధి (EPF) స్కీమ్-2026ను అధికారికంగా నోటిఫై చేసింది. సామాజిక భద్రత కోడ్-2020 అమలులో భాగంగా రూపొందించిన ఈ కొత్త స్కీమ్ జూన్ 29 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో 1952 నుంచి అమలులో ఉన్న ఈపీఎఫ్ స్కీమ్ స్థానంలో కొత్త విధానం అమలవుతోంది.
కొత్త స్కీమ్‌లో ఉద్యోగులు, యజమానుల ఈపీఎఫ్ చందా శాతాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే డిజిటల్ సేవలు, ఆన్‌లైన్ కంప్లయెన్స్, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఆధారిత సేవలు, నిధుల నిర్వహణలో పారదర్శకతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
అలాగే సభ్యత్వం, క్లెయిమ్‌లు, ఉపసంహరణలు, యజమానుల బాధ్యతలకు సంబంధించిన నిబంధనలను మరింత స్పష్టంగా రూపొందించి, ఈపీఎఫ్ సేవలను సులభతరం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం తెలిపింది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments