ePaper
Wednesday, July 1, 2026

అర్హులైన జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు: కొండా మురళీధర్ రావు

వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అందజేస్తామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ప్రకటించారు.

సోమవారం హనుమకొండలోని తన నివాసంలో జర్నలిస్టు ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా ఆయన ఈ హామీ ఇచ్చారు. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు (అక్రిడిటేషన్) కార్డు కలిగి ఉన్న అర్హులైన జర్నలిస్టులకు సీనియార్టీ ప్రాతిపదికన ఇళ్లను కేటాయిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా జర్నలిస్టులు పారదర్శకంగా పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జర్నలిస్టుల సంఖ్యకు తగ్గట్టుగా వార్తా కథనాలు కనిపించడం లేదని పేర్కొంటూ, ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని మరింత విస్తృతంగా అందించాలని కోరారు.

త్వరలోనే అర్హులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అప్పగించేందుకు చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో జర్నలిస్టు ప్రతినిధులు కోరుకొప్పుల నరేందర్, జక్కు విజయ్, కందుల శ్రీధర్, జన్మస్వామి, విజయన్, హరీష్, బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!