ePaper
Saturday, September 5, 2026

పేదల చిరకాల స్వప్నం సొంతింటి కల సాకారం.

చీకటి వెలుగు నల్లగొండ.

స్వాతంత్ర దినోత్సవ వేళ నల్గొండ జిల్లా కేంద్రంలోని గొల్లగూడలో 552 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందించిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పేదల చిరకాల స్వప్నమైన సొంతింటి కలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన నల్గొండ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న అనంతరం నల్లగొండ పట్టణంలోని గొల్లగూడ ప్రాంతంలో నిర్మించిన 552 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించడమే కాకుండా, లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. అంతేకాక అక్కడే ఏర్పాటుచేసిన సమావేశంలో లబ్ధిదారులందరికీ ఇంటి కేటాయింపు ఉత్తర్వులను

పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 552 మంది లబ్ధిదారులకు ప్రతి కుటుంబానికి ఇంటి అవసరాల కోసం రూ.10 వేల చొప్పున తన సొంత నిధులతో ఆర్థిక సాయం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలివేసిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు మరమ్మతులు చేయించి పేదలకు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇళ్లతో పాటు సీసీ రోడ్లు, డ్రైనేజీ, నీటి కనెక్షన్లు వంటి మౌలిక వసతులను కూడా కల్పించామని చెప్పారు.
పేదలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్‌, రేషన్‌ కార్డుల వంటి పథకాలను అమలు చేస్తున్నదని మంత్రి తెలిపారు. నల్లగొండ గొల్లగూడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో 143 మంది మైనార్టీలకు ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. తాను బతికున్నంతకాలం ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటానని, తనకు చేతనైనంతవరకు పేదలకు సహాయం చేస్తానని మంత్రి తెలిపారు.ఇళ్లు పొందిన లబ్ధిదారులు త్వరగా గృహప్రవేశాలు చేసుకుని సొంతింటిలో ఆనందంగా జీవించాలని కోరారు. గొల్లగూడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయంలో
రేషన్‌ షాపు, సూపర్‌ బజార్‌
ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.ఇండ్లు రాని అర్హులైన వారు తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
నల్లగొండ పట్టణంలో ప్రతి వీధిలో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని , సుమారు రూ 900 కోట్లతో ఔటర్‌ రింగ్‌ రోడ్డు పనులు పురోగతిలో ఉన్నాయని, మరో వెయ్యి కోట్లతో పట్టణంతోపాటు, చుట్టుపక్కల, మొత్తం రూ.2 వేల కోట్లతో నల్లగొండ పట్టణాన్ని రోడ్లు, డ్రైన్లు, తాగునీటి పనులతో అభివృద్ధి చేయనున్నామని, రాబోయే రెండున్నర సంవత్సరాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని వెల్లడించారు. నల్గొండ కార్పొరేషన్ లో ఇండ్లు రాని, అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇచ్చేందుకు
తిప్పర్తి–మునుగోడు రోడ్డు, మిర్యాలగూడ రోడ్డు, దుప్పలపల్లి రోడ్డు, దేవరకొండ రోడ్డు లలో స్థలాలను పరిశీలించడం జరిగిందని, అర్హులైన పేదలకు 75 గజాల స్థలం ఇచ్చి రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.గత ఏడాది సుమారు 700 మంది లబ్ధిదారులకు రూ.5 లక్షల చొప్పున ఇళ్లు నిర్మించి ఇచ్చామని చెప్పారు.
నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఎస్ ఎల్ బి సి వద్ద
రూ.200 కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌
నల్లగొండలో అన్ని వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు 2,500 మంది విద్యార్థులతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ను నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు.
నల్గొండ పార్లమెంట్‌ సభ్యులు రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ 552 ఇందిరమ్మ ఇళ్లకు గృహప్రవేశాలు చేయించడం అభినందనీయమని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయించారని తెలిపారు.
ఇంకా ఇళ్లు రాని అర్హుల కోసం నల్లగొండ నగరానికి నాలుగు వైపులా స్థలాలను పరిశీలిస్తున్నామని, మిగిలిన లబ్ధిదారులకు కూడా ఇళ్లు నిర్మించి అందిస్తామని చెప్పారు. ఎంపీ నిధులతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నివాస ప్రాంతంలో ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్‌

బి చంద్రశేఖర్ మాట్లాడుతూ
ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదల కలను సాకారం చేసేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.ఈ ప్రాంతంలో 24 బ్లాకుల్లో 552 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి అందిస్తున్నామని చెప్పారు.
మొత్తం ఆరు ఎకరాల విస్తీర్ణంలో రూ.36 కోట్ల వ్యయంతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఇళ్లతో పాటు అవసరమైన మౌలిక వసతులను కల్పించి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు.
పేదల చిరకాల స్వప్నమైన సొంతింటిని స్వాతంత్ర్య దినోత్సవం రోజున అందించడం సంతోషంగా ఉందని, లబ్ధిదారులు ఇళ్లను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి,

ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయ వీర్ రెడ్డి ,డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీస్ ఖాన్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ ,స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్డీవో అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ లోకి లాల్ రాజ్ కుమార్, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, తహసిల్దార్ పరుశురాం,
స్థానిక కార్పొరేటర్ జ్ఞానేశ్వరి మాజీ జెడ్పిసి గుమ్మల మోహన్ రెడ్డి. గృహ నిర్మాణ అధికారి
డి వెంకటేశ్వర్లు, తదితరులు ఉన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!