ePaper
Tuesday, June 30, 2026

దిండి డివిజన్‌లో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఘన సన్మానం

నల్లగొండ, జూన్ 30 (చీకటి వెలుగు) :

నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ పరిధిలోని దిండి డివిజన్–8లో పదవీ విరమణ పొందిన సీనియర్ అసిస్టెంట్ శ్రీ పుల్లయ్య, రికార్డు అసిస్టెంట్ శ్రీమతి నర్గీస్‌లను అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీఎన్‌జీవోస్ కోశాధికారి, నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు మేడి జయరావు జిల్లా టీఎన్‌జీవోస్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగ జీవితంలో వారు అందించిన సేవలను కొనియాడుతూ, పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యనిర్వాహక ఇంజనీర్ బి. రాములు, డీఏఓ మధుసూదన్, సూపరింటెండెంట్ జాఫర్ సాబ్, డీఈఈలు ప్రభాకర్, మనోహర్, శ్రీనివాసరావు, హనుమంతరావు, సీనియర్ అసిస్టెంట్ గోపాల్‌రెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు రాజేష్, నాగేశ్వరరావు, రవి తదితరులతో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొని పదవీ విరమణ పొందిన ఉద్యోగులను అభినందించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!