ePaper
Saturday, September 5, 2026

హ్యం రోడ్లతో రాష్ట్ర రూపురేఖలు మారుతాయి

బహిరంగ సభను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు

చీకటి వెలుగు నల్లగొండ.

హ్యం రోడ్డుతో రాష్ట్ర రూపురేఖలు మారుతాయని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
సోమవారం నల్లగొండలోని ప్రకాశం బజార్ లో నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీర్ రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘువీర్ రెడ్డికి విషెస్ తెలిపారు.
అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రోడ్లు అభివృద్ధి చెందితే పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని, పరిశ్రమలు ఏర్పడడానికి అవకాశం ఉంటుందన్నారు.
దీంతో స్థానిక యువత, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యే హం ప్రాజెక్టుకు నల్గొండ జిల్లాలోని కనగల్ మండల కేంద్రంలో పైలాన్ ప్రారంభించుకోవడం జరిగిందన్నారు.
మినిస్టర్ గా తాను రెండు సంవత్సరాల కాలంలోనే రూ.7,110 కోట్ల ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ కింద నిధులు మంజూరు చేయించుకుని రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు.
అదేవిధంగా సిఆర్ఐ కింద జంక్షన్లు, సీసీ రోడ్లకు రూ.1900 వందల కోట్లను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కలిసి మంజూరు చేయించుకోవడం జరిగిందని పేర్కొన్నారు.
ఈ రెండు రోజులలో మరోసారి ఢిల్లీకి వెళ్లి రోడ్ల కోసం మరో రూ.1000 కోట్లను మంజూరు చేయించుకోవడం జరుగుతుందని వెల్లడించారు.

విజయవాడ-హైదరాబాద్ ఫోర్ లైన్ కోసం టెండర్లు పిలిచామని పేర్కొన్నారు.
అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డు టెండర్లు పిలవడం జరిగిందని,జూన్ 6న టెండర్లు జరుగుతాయన్నారు.
రూ.11 వేల కోట్లతో ఈ రోడ్డు అభివృద్ధి పనులు జరుగుతాయని తెలిపారు.
రూ.13 వేల కోట్ల రూపాయలతో హ్యం రోడ్లను ఫైనల్ చేసి పనులు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.
రోడ్లు అభివృద్ధికి సూచికలని ఈ సందర్భంగా మంత్రి అన్నారు.
ఈ పరిశ్రమ పెట్టాలన్న రోడ్లు అభివృద్ధి చెందాలన్నారు.
దీంతో స్థానిక యువతకు నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు.
రూ.26 వేలకోట్లతో ఆర్ అండ్ బి శాఖ ద్వారా, రూ.40 వేల కోట్లతో నేషనల్ హైవే రోడ్డు పనులు జరుగుతున్నాయన్నారు.
గుర్రంపోడ్ దాటిన తర్వాత 3 కిలోమీటర్ల పక్క నుంచి గ్రీన్ ఫీల్డ్ సిటీ హైవే బందర్ వయా అమరావతి వరకు డిపిఆర్ పూర్తయి టెండర్ స్టేజ్ లో ఉందన్నారు.
మన్ననూరు-శ్రీశైలం 52 కిలోమీటర్ల ఎలివేటర్ కారిడార్ ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు.
మూడు నెలల్లో డిపిఆర్ ఫైనల్ అయితే క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత పనులు ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

బహిరంగ సభ విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు

నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ విజయవంతం అయిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు
సభ విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఊహించని రీతిలో బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారని పేర్కొన్నారు.

ఈ విలేకరుల సమావేశంలో నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్,నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్,మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, నల్లగొండ,కనగల్, తిప్పర్తి మాజీ జడ్పిటిసిలు వంగూరి లక్ష్మయ్య, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, పాశం రామ్ రెడ్డి, డిసిసిబి మాజీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, నల్లగొండ పిఎసిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు పాదం అనిల్ కుమార్, పలువురు కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!